Saturday, January 21, 2012

ఈ-లెర్నింగ్ అంటే ఏమిటి?


అసలు ఈ-లెర్నింగ్ అంటే ఏమిటి?
ఆధునిక సమాచార పరిజ్ఞానాలను వాడుకుంటూ ఎలక్ట్రానిక్ మాధ్యమంగా చెప్పే విద్య ని ఎలక్ట్రానిక్ లెర్నింగ్ అనవచ్చు. ఈ పద్ధతి లో విద్యార్ధి, ఉపాధ్యాయులు ఒకే తరగతి గదిలో ఉండి నేర్చుకోవచ్చు లేదా ఇద్దరూ ఈ భూ భాగం లో తలో దిక్కున ఉండీ నేర్చుకోవచ్చు. ఈ పద్ధతి కనుక పాటిస్తే దూర విద్య లో అవకతవకలు అరికట్తవచ్చన్నది నా భావన.

సరే ఇంతకీ ఈ ఇ లెర్నింగ్ చరిత్రలోకి వెళితే...
వికీపీడియా అందించిన వివరాల ప్రకారం……….

అరవయ్యో దశకం లో అమెరికాలోని స్టా న్ ఫర్డ్  యూనివర్సిటీ వారు తొలుతగా చిన్నారులకు లెక్కల పాఠాలను కంప్యూతర్ ద్వారా చెప్పడం ప్రారంభించారు. దీనినే కంప్యూటర్ బేస్డ్ ట్రెయినింగ్ అన్నారు. ఆ తర్వాతి కాలం లో '93 లో విలియం డి గ్రజియడె అనే పెద్ద మనిషి కంప్యూటర్ లో తో ఓ ట్యుటోరియల్ ను అంటే బోధన మరియు దానికి సంబంధించిన అవగాహనా, అంచనా విధానాన్ని రూపొందించాడట. 1997 లో అతను ఒక సాంకేతిక ఆధారిత కోర్సును అభివృద్ధి చేసి దాని నిర్వహణ వ్యూహం, అభివృద్ధి పై ఒక వ్యాసం ప్రచురించాడు. దీనికై ఉపయోగించే ఉత్పత్తులు ఉపయోగించడం మరియు నిర్వహించడానికి సులభంగా ఉండాలి అన్నాడు. అంటే పోర్టబుల్, రెప్లికబుల్, స్కేలబుల్, వెంటనే కొనగలిగేలా అందుబాటు ధరలో ఉండాలని అన్నాడట. ఆ తర్వాతి కాలం లో ఇ లెర్నింగ్ ఓ ప్రభంజనం అయ్యింది. ఈ దిశలో బోలెడు కోర్సులు అందుబాటులోకి రావడమే కాదు, ఎన్నో సంస్థలు డిగ్రీలు సైతం అందిస్తున్నాయి. అలాగే ఈ రంగం లో ఉపాధి అవకాశాలూ మెరుగయ్యాయి. అయితే దీనికి సంబంధించి కొన్ని ప్రమాణాలూ, పద్ధతులు ఉన్నాయి. అవన్నీ మెల్లిగా అర్ధం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 

No comments:

Post a Comment