Tuesday, January 24, 2012

ఇ-లెర్నింగ్ కొన్ని ప్రమాణాలు


ఇ-లెర్నింగ్ విధానం లో కోర్సు రూపొందించాలంటే కొన్ని ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రమాణాలు లో సాధారణ కంటెంట్ కు ఉండే నియమాలు, ఇ లెర్నింగ్ కు వాడే సాఫ్ట్ వేర్ విధి విధానాలు మరియు లెర్నింగ్ మేనెజ్ మెంట్ సిస్టం అని  ఉన్నాయి. ఈ ప్రమాణాలు ఒక కోర్సు ను వివిధ ప్లాట్ ఫారంస్ పై పనిచేసేలా ఎలా రూపొందించాలి? ఎలా పంపిణీ చెయ్యాలి అనే విషయాలను ఆకళింపు చేసుకోవడానికి ఉపయోగ పడతాయి.

ఈ నియమాలు లేదా ప్రమాణాలను ప్రస్తుతం నాలుగు ప్రధాన సంస్థలు రూపొందిస్తున్నాయి. అవిAICC, IEEE, IMS, mariyu ADL. ముఖ్యంగా మూడు విషయాలను దృష్టి లో ఉంచుకుని వీటిని రూపొందిస్తారు.
కమ్యూని కేషన్ ఇంటర్ ఫేస్ లేదా ఎ పి ఐ - వనరులను ఇతర వ్యవస్తలతో ఎలా కమ్యూనికేట్ చెయ్యాలి అనే విషయం,
మెటా డేట- ఒక స్థిరమైన పద్దతిలో ఇ-లెర్నింగ్ వర్ణించడం
కంటెంట్ ప్యాకేజింగ్ - వనరులు లేదా రిసోర్సు లను ఉపయోగకరమైన బండిల్స్ లోకి తేవడం ఎలా అనే విషయం.
ఇ లెర్నింగ్ ప్రమాణాలు రోజు రోజుకూ కొత్త విషయాల్ని సంతరించుకుంటూ ముందుకు సాగుతున్నాయనడం లో సందేహం లేదు. వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, పాటిస్తూ పోతే ఇ లెర్నింగ్ రంగం లో ఉన్నత శిఖరాలు అందుకోవచ్చు.

4 comments:

  1. Super Like. Though it is small article, definitely it is useful to the beginers in the e-learning industry. Many Content writers/Designers still doesn't know what is LMS, CMS, ADL etc. Best Regards, Shareef

    ReplyDelete
    Replies
    1. Thank you, Shareef, will update with more details.

      Delete
  2. hi,
    it's me lakshmy, ur e-friend [batchmate of pgdel]. mee write-up chadivaanu, baagundi. inka update cheste baguntundi.
    good attempt!! keep it up.

    ReplyDelete